MENU

Fun & Interesting

చంద్రబాబు ఆ బాపతు నాయకుడు: YSRCP leader Lakshmi Parvathi | Asianet News Telugu

Asianet News Telugu 93 12 hours ago
Video Not Working? Fix It Now

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎదుగుదలలో ప్రతి అడుగులోనూ ఆయన చేసిన కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తాయన్నారు. రాయలసీమలో తన స్వార్థం కోసం హత్యాలను ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబు సొంతమని ధ్వజమెత్తారు. త‌న 45 ఏళ్ల జీవితంలో హ‌త్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చంద్ర‌బాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో నారా లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో సంక్షేమ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. #Chandrababu #NaraLokesh #NandamuriLakshmiParvati #YSRCP #AndhraPradeshPolitics #AndhraPradesh #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Comment