రచన : ఎర్రం శెట్టి సాయి
సామంత ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో నుంచి చిరాకుగా బయట చీకట్లోకి చూస్తున్నాడు. ఉండి ఉండి సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ కిటికీలో నుంచి చేయి జాపి చూసి విసుక్కొంటున్నాడు.
'వెధవ వర్షం! ఇప్పుడే మొదలెట్టాలా? స్టేషన్కి రంగన్నదొర వస్తాడో, రాడో ? రాకపోతే ఈ వర్షంలో తనెలా పోగలడు ? ఒక వేళ వర్షం లేకపోయినా కూడా అతనిల్లు కనుక్కోవడం తనకి కష్టమే ఆవుతుంది. ఇంత రాత్రివేళ ఎవర్ని లేపి అడగాలి?....”