MENU

Fun & Interesting

ఇంతింతై ( పేరెంట్స్ కి వుండే గుడ్డి ప్రేమల వల్లనో పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఖండించక పోతే )

కథ కాలక్షేపం 5,144 lượt xem 1 week ago
Video Not Working? Fix It Now

రచన: వనజ తాతినేని

కుండీలో ఏపుగా కొమ్మా రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ వున్న చంద్రకాంత మొక్కను చూస్తూ వుంది మైధిలి. ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును. ములుకులు లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు.
అత్తగారు నిర్మల మాటలు చెవిలో గింగిరాలు కొడుతూ వుంటాయిలా. “అమ్మాయ్! ఇంకా ఎందుకా మొక్కకు పోషణ చేస్తావ్! బడితలా పెరిగింది కానీ.. ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు. పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి. హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు.”
సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతటదే మాయం అయిపోవాలి.లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో నింపేయాలి. ఇదే మానవుడి లక్షణం అన్నట్లు వుంటున్న ఆమెను చూస్తే మైథిలి కి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది.

Comment