#Raitunestham #Millets #DrKhaderVali
సమగ్ర పోషకాలు ఉన్న ఆహారం... సరైన జీవన విధానంతో... సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆహార, ఆరోగ్య నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. మన పూర్వీకులు.. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకొని.. వందేళ్లు ఆరోగ్యంగా జీవించారని... ఆధునిక తరాలు, ఆహారం నుంచి చిరుధాన్యాలను దూరం చేసుకొని అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుధాన్యాలను తిరిగి వంటింటికి చేరువ చేస్తే... దెబ్బతిన్న ఆరోగ్యాలు బాగవుతాయని స్పష్టం చేశారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఫిబ్రవరి 12న గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరిలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని... రోగాల నియంత్రణ, నివారణ పై విలువైన సమాచారం అందించారు. మిల్లెట్ రాంబాబు, మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ, భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యులు కుమార స్వామి, నేరెళ్ల తిరుపతిరావు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
☛ Subscribe for latest Videos - https://youtu.be/8Rd49ovG6XA
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham