పాడాలని నాకున్నా పాడలేక పోతున్నా //, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
పాడాలని నాకున్నా పాడలేక పోతున్నా
కవిత రాయ మనసున్నా కలము కదుప లేకున్నా
రామ నామ సంకీర్తనలో మైమరచి పోదామన్నా
నోటి వెంట మాటే రాకా మూగబోయి నిలుచున్నా
భక్తి గీత పారాయణలో ముక్తి పదము చూదామన్నా
మాయదారి భవబంధాలు నే వదలక పోతున్నా
పాడలేని దీనుడ నేనై మోడు లాగా బ్రతికే కన్నా
ఈ దేవుని సన్నిధిలోనా కనుమూయుట ఎంతో మిన్నా