Dr Nori Dattatreyudu tells about Cancer and treatment #Oncology #Basavatarakam cancer | #Vyus.in
Vyus
19,757 lượt xem 2 years ago క్యాన్సర్ పాలిట కాలయముడు
హస్తవాసి పేరు వినే ఉంటారు. ఆయన చేయి పడితే చాలు ఎంత రోగమైనా ఇట్టే నయమవుతుందనే మాటా వినే ఉంటారు. కొందరు వైద్యుల గొప్పతనాన్ని చెప్పడానికి ఈ పదం వాడుతుంటారు. హస్తవాసి ఉన్న వైద్యుడే కాక.... క్రిటికల్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో నిష్ణాతుడాయన. సామాన్యుడి నుంచి ధనికుల వరకూ అందరూ ఆయనకు సమానమే. వ్యాధి నుంచి స్వాంతన చేకూర్చడమే ఆయన థ్యేయం శ్రీదేవి తల్లికి జరిగిన ఆపరేషన్‌లో తప్పును సవరించడం దగ్గర నుంచి సోనియా గాంధీకి ట్రీట్‌మెంట్ వరకూ ఎన్నెన్నో క్లిష్టతరమైన కేసులను ఆయన పరిష్కరించారు. మా వల్ల కాదని హేమాహేమీలు చేతులెత్తేసిన కేసులను ఆయన సునాయసంగా ట్రీట్ చేశారు. ఆయన తెలుగువారు. అచ్చమైన గోదావరి జిల్లా వారు. ఆయనే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా... రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలతో పాటు తన స్వ విషయాలను కూడా వివరించారు డాక్టర్ గారు. సామాన్య కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద క్యాన్సర్ హాస్పటల్‌కు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆయన వద్దకు క్యాన్సర్ రోగులు విచ్చేస్తారు. క్యాన్సర్ పాలిట కాలయముడాయన. వ్యాధి నివారణకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త విధానాలను కనుగొంటూ క్యాన్సర్ రోగుల ఇలవేల్పుగా మారారు. డాక్టర్ దత్తాత్రేయుడుతో వైజయంతి మాటామంతి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వ్యూస్ చానెల్‌లో చూడండి.
Visit us : https://vyus.in/
Follow Us @
Facebook: https://www.facebook.com/VyusTheUnbiased
Twitter : https://twitter.com/VyusOpinion
Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed