రచన. రాజేందర్ గణపురం.
గానం. ప్రసన్నావిజయ్ కుమార్..
వీడియో ఎడిటింగ్. ప్రసన్నావిజయ్ కుమార్...
TeluguSongs#bhaktisongs#
. విశ్వబ్రాహ్మణ గేయము
. ................... ............
..
ప॥ విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే
విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే
పరివర్తన ప్రగతికి
సుస్థిర జగతికి...
నాడైనా..నేడైనా..ఏనాడైనా.!
.
చ॥ శబ్దానికి అక్షరాలు చేకూర్చింది
నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్ష మన్నది
సాగు చేయగా, సాలుదున్నగా, కోత కోయగ
నాగలి రోకలి కత్తి కొడవలి
సృష్టించి సృష్టికి అందించినది
విశ్వబ్రహ్మరా..విజ్ఞాన ధాతరా
కర్మయోగిరా..నిత్య ధర్మనిరతిరా
చ॥ ఇనుమును కరిగించి ఇరుసు బిగించి
మనమును మర్దించి దినుసును తెచ్చి
సాలె మగ్గము, బండి చక్రము, రాగి పళ్ళెము
కోటను నిర్మించి బాటను వేసి
జీవకోటికి ఆదర్శం తానైనది
చ॥ బంగారు తో నిలువెత్తు సింగారించి,,శిల్ప
భంగిమలు సంకల్పం ఇలకందించి
దైవ కార్యము, ముక్తి మార్గము, ధ్యాన పీఠము
దైవమును దర్శించగా విగ్రహాలను మలిచి
పాపపుణ్య సద్గతులను బోధించింది
చ॥ చుక్కాని తో తీరమును చేర్పించింది
చక్కని మనుగడకు దారేసింది
విల్లు బాణము, చల్ల కవ్వము, తలుపు గొళ్ళెము
కొంగు ముడి బంధానికి హంగులు దిద్ది
పుస్తె చేసి పల్లకిలో ఎక్కించింది
చ॥ సృష్టికి ప్రతి సృష్టి ఈ కష్టజీవిరా
నియమ నిష్ఠ దినకరుడు నింగి మెరుపురా
సృజన తేజము, ప్రజలక్షేమము, అజుడునిత్యము
అగణితమౌ గుణగణ ప్రాజ్ఞ శీలుడు
సమృద్ధి బుద్ధి నందించు పూర్ణాచార్యుడు.
.
. గేయ రచన
. రాజేందర్ గణపురం
.