#raitunestham #terracevegetablegarden #gardenideas #organicvegetables
ఎల్లప్ప, సుష్మ దంపతులు ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయల కోసం మూడు సంవత్సరాల క్రితం తమ ఇంటి మిద్దె మీద మిద్దెతోటను ప్రారంభించారు. ఇంటి నిర్మాణ సమయంలో మిద్దె తోట గురించి ఆలోచన లేదు కాబట్టి స్లాబు నిర్మాణంలో ఎలాంటి మెళకువలు పాటించలేదు. కాబట్టి మిద్దెతోట ప్రారంభించే ముందు వాటర్ ఫ్రూఫింగ్ చేయించి ప్రారంభించారు. వీరి మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలతో పాటు తప్పనిసరి అవసరమైన కొన్ని రకాల ఔషధ మొక్కలను కూడా పెంపకం చేస్తూ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో మొక్కలు పెంపకం చేయాలనే ధ్యేయంతో ప్లాస్టిక్ టబ్బులు, కుండీలు, బక్కెట్లు, ఆయిల్ క్యాన్స్ లాంటి వాటిని ఎంపిక చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తమ ఇంటికి అవసరమైన ఆకుకూరలు, కూరగాయలలో 60 శాతం వరకు తమ ఇంటి పంట నుంచే పొందుతూ సొంత ఇంటి పంట రుచిని ఆస్వాదిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో యాక్టివ్‌గా ఉంటూ ఇంటి పంటదారుల సంఖ్య పెరగడములో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు ఎల్లప్ప మరియు సుష్మ దపంతులు