#raitunestham #terracevegetablegarden
ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడంతో పాటు మిద్దెతోట అందంగా, ఆహ్లాదంగా కనిపించాలనే లక్ష్యంతో 10 లక్షల రూపాయాలకు పైగా వెచ్చించి ప్రశాంతిగారు మిద్దెతోటను ఏర్పాటు చేసుకున్నారు. ఇంటిని నిర్మించుకునే సమయంలోనే మిద్దెతోటను పెంచాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి అందుకు అనుగుణంగా స్లాబును ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల మిద్దెతోట పెంపకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. మిద్దె మీద స్టాండ్‌లు ఏర్పాటు చేసుకుని ఆ స్టాండ్‌లపై సిరామిక్ కుండీలను అమర్చి మొక్కల పెంపకం కొనసాగిస్తున్నారు. తమ ఆహారానికి ప్రాముఖ్యతను ఇవ్వడంతో పాటు అందానికి, ఆహ్లాదానికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చి పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, పూలు, అడీనియం లాంటి మొక్కలను ఏలాంటి రసాయనాలు అందించకుండా సేంద్రియ పదార్థాలతో పండించుకుంటూ సొంత ఇంటిపంట రుచిని సంవత్సరం పొడవునా ఆస్వాదిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపోను మిగిలిన దిగుబడులను స్నేహితులకు, బంధువులకు, తోటి ఇంటి పంట దారులకు అందిస్తూ పంచడంలో ఉన్న తృప్తిని కూడా ఆస్వాదిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో యాక్టివ్‌గా ఉంటూ ఇంటి పంటదారుల సంఖ్య పెరగడములో తను కృషి చేస్తూ. తోటి మిద్దెతోట సాగు దారులకు స్పూర్తిగా నిలిచారు.