#raitunestham #terracegarden #terracevegetablegarden #మిద్దెతోట
సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారాన్ని వినియోగించుకోవాలనే లక్ష్యంతో పూర్ణిమ గారు తమ ఇంటి మిద్దె మీద నాలుగు సంవత్సరాల క్రితం మిద్దెతోటను ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు ప్రాముఖ్యతను ఇచ్చి కేవలం పరపరాగ సంపర్కం మరియు పూజ కొరకు మాత్రమే కొన్ని పూల మొక్కలను పెంపకం చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తి సేంద్రియ పదార్థాలతో ఆకుకూరలు, కూరగాయలు పెంపకం చేస్తూ వచ్చిన దిగుబడిని సొంతానికి ఉపయోగించుకుంటూ సొంత ఇంటి సేంద్రియ ఆహార రుచిని ఆస్వాదిస్తున్నారు. వాట్సప్ గ్రూపులలో యాక్టివ్‌గా ఉంటూ విత్తనాలను, నారుమొక్కలను, దిగుబడులను అవసరమైన వారికి అందచేస్తూ ఇంటి పంటదారుల సంఖ్య పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు పూర్ణిమ గారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/1znaezbvLsI
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham