పిలచిన పలికే- దైవం నీవనీ
పరిపరివిధముల- వేడితినీ
ఏడుకొండలవాడా - వెంకటరమణ॥॥పి
చ.నీమహిమలెన్నో- వర్ణించతరమా
నమ్మితినిన్నే- ననుగనరావా
జాలమేలరా- బ్రోవగరావా॥పి
చ.నీ దర్శనంతో- తరించేరెందరో
శరణాగతులై- సేవించేరెందరో
ప్రహ్లాదవరదా- కలియుగదైవమా॥॥పి
పిలచినపలికే దైవం VenkataRamana(Dr.GV Rajeswari Subrahmanyam)
సహస్రగళ సంకీర్తన భక్తులకు నేర్చుకోవలసిందిగా అభ్యర్ధన🙏🏼