ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి రామ చంద్రుని సీతా లక్ష్మణులు ఇరు వైపులా నిలిచి , ఏ విధంగా సేవిస్తున్నారో, ఆ విధానం తెలియ చేయమని కోరుతున్నారు. ఇందులో కాయిక, వాచిక, మానసిక భక్తి విధానాలు తెలియ జేస్తూ, చరణంలో శారీరకంగా వందనం చేస్తున్నారా, వాచికంగా నామ స్మరణ చేస్తున్నారా, లేక మానసికంగా స్మరణ చేసి మైమరచి పోవుచున్నారా అని అడిగారు. ఏకంగా చేస్తే తరించ గలము అని ప్రశ్నించారు. నిజానికి వారు చేసేది అదే. మన అందరికోసం అడిగిన సందేహమే ఇది. ఏదో ఒకటి చేసినా తరణోపాయమే. భగవద్గీత లో కృష్ణుడు చెప్పినట్లు పత్రం పుష్పం ఫలం తోయం. ఏదైనా గానీ చిత్త శుద్ధి, అపారమైన భక్తి ముఖ్యం అని గ్రహించనలెను.నమస్కారం.