చతుర్దశ రాగ మాలిక, అనగా పదునాలుగు రాగాలతో అల్లిన మాల. ఈ పధ్నాలుగు లోకాలను యేలేటి అ పరమ శివునికి పధ్నాలుగు రాగాలతో, దీక్షితుల వారు అల్లిన అద్భుతమైన మాల ఈ కీర్తన. విశ్వాన్ని యేలే విశ్వనాధునితో శుభప్రదంగా, శ్రీ రాగంతో పల్లవి ప్రారంభించి, చరణాలు వరసగా, ఆరభి, గౌరి, నాట, గౌళ, సారంగ, మోహన, సామ, లలిత, భైరవం, శంకరాభరణం, కాంభోజి, దేవక్రియ, భూపాలం మొదలైన రాగాలను, ఆయా రాగ ముద్రలు వచ్చేలా, ఆయా రాగ స్వరూపాన్ని సమగ్రంగా ఆవిష్కరణ చేస్తూ, అద్భుతమైన రీతిలో చేశారు. ఈ కీర్తన పాడుతున్నా , వింటున్నా అత్యంత విస్తృతమైన దృష్టికోణం ఏర్పడి, భావం మరింత విశాలమై, పధ్నాలుగు లోకాలు కళ్ళ ముందు కదలాడుతున్న అనుభూతి తప్పక కలుగుతుంది. విశ్వనాధుని విశ్వరూప సాక్షాత్కర సందర్శన మౌతుందనుటలో సందేహం లేదు. అంత అపురూపమైన కీర్తన ఈ మహా శివరాత్రి పర్వదిన శుభ సందర్భమున మీకు వినిపించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. మరి విని ఆదరిస్తారుగా. నమస్కారం.🙏