ఈ కీర్తన ఒక అజ్ఞాత వాగ్గేయ కారుడైన యడ్ల రామదాసు చేసిన కీర్తన. పూర్తి జానపద పదాలతో, శ్రీమన్నారాయణుడి దశ అవతారాలను, జన పదుల నోళ్లలో నానే విధంగా ఎంతో చక్కగా వ్రాశారు. దానిని డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ, అంతే అందంగా పూర్తి జానపద పదాల యాసతో,అదే బాణీతో పాడిన విధానం అత్యద్భుతం. ఇది చాలా యేళ్ళ క్రితమే, ఆకాశవాణి, భక్తి రంజనిలో అందరూ విన్న కీర్తనే. ఈ మధ్య ఈ కీర్తన పై, ఈ బాణీపై ఉన్న మక్కువతో, ఒక చలనచిత్రంలో కూడా వాడడం జరిగింది. నాకు కూడా ఈ దశావతారాల కీర్తన పై గల అమితమైన మక్కువతో, నాకు వీలైనంతలో, ఈ కీర్తన ఈ బాణీలో పాడే ప్రయత్నం చేశాను. మరి, విని ఆదరిస్తారుగా! నమస్కారం.