శివయ్య వైభోగం చూద్దాము రారండీ //, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
శివ - కళ్యాణ వైభోగమే పాట స్టైల్
శ్రీరామలింగా ఓ స్మర గర్వ బంధ రావేల మమ్మేలరా
శ్రీరామలింగేశ్వరా ప్రియ పర్వత వర్ధన హృదయేశ్వరా
పరమానంద దాయక శరణంటిరా
కనులిచ్చి కన్నప్ప ఘనుడాయెను
నిను కొలచి గౌరమ్మ మనువాడెను
దివి నుండి దిగి గంగ సిగ చేరెను
కమనీయ నీ కథలు పాడుదును
కంఠమున గరళంబునే దాల్చినా
పరమాత్మ వినవేమి మా ప్రార్థనా
పగబూను గతమేమి ఫణిభూషణా
నిరతంబు చేసెద నీ భజనా
భవ బంధములు బాపు పరమేశ్వరా
మది నిన్ను మరువనురా శంకరా
బింకంబు నీకేల బింబాధరా
మౌనంబు చాలించి మన్నించరా