సీతారామా ఆ కళ్యాణంలో //, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
సీతారామా.. ఆ కళ్యాణంలో అందమైన.. ఆ వైభోగంలో
సీతాకళ్యాణమే ఇలలో వైభోగమే
తరములు నిలచిన జగములు మురిసిన రామ కళ్యాణం
పెళ్ళి అంటే సీతారామ కళ్యాణమే
మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే
ఇంతకన్న గొప్ప పెళ్లి జరుగలేదని
అంతకన్న గొప్ప జంట చూడలేదని
తరతరాలు చెప్పుకున్న ఇది తరగని వైభోగం
భూదేవి మారెనంట పెళ్లి పీటగా
ఆకాశమంత పెద్ద పందిరాయెగా
దేవ దుందువులు మ్రోగె దిక్కుదిక్కునా
పూలవాన కురిసెనంట జల్లుజల్లుగా
తర తరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం
రతనాలే అక్షింతలై మెరిసెనంటా
ముత్యాలే తలంబ్రాలుగ మారెనంటా
కళ్యాణ రామయ్య చిరునవ్వులే
సీతమ్మ సిగ్గులే రంగవల్లులై
తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం