రాముడున్నాడు చూడరోరన్నా//, తెలుగు భజన పాటలు//, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
రాముడున్నడు చూడరోరన్నా
నీ ఆత్మలో రఘురాముడున్నడు చూడరోరన్నా
రామ రామ రామ సీతా రామమయమే లోకమంతా
కామ క్రోధము వదులుకోని కర్మఫలములు తెలుసుకో
భ్రాంతిలో బడి మరువబోకన్నా నీ భార్య పిల్లల
బ్రాంతిలో బడి మరువబోకన్నా
అంతరాత్మను నిలుపుకోని ఆత్మజ్ఞానము తెలుసుకోని
చింత మానస గురుని బోధ చిటికెలో అదృశ్యమాయెను
పరమాత్మను ఎరుగరేమన్నా ఈ పాపి జన్మ
పరుగు లేయుట మానరేమన్నా
క్రూర మానస సూర వీర కుటిల గుణమును మానుకోరా
దారితెలియక మోక్ష సాధన దైవ సన్నిధి చేరుకోరా
దుర్మదాంధుల కలువరాదన్నా ఈ జన్మ సాం తము
దుఃఖమందున మునుగరాదన్నా
దైవ మార్గము తెలుసుకోని ధరణియందున
ధన్యుడాయె
నిర్మాలాత్ముడైన రాముని నిష్ఠతో భజియించుకో
పరుల మాటలు నమ్మరాదన్నా ఎవరెవరి కర్మ
ఎటుల గలదో తెలియదేమన్నా
పరిహాసము చేయకింకా పరులను దూషించకింకా
గురుదేవుడన్న మాట గుట్టు రట్టుగ తెలుసుకో
చావు తప్పదు నిక్కమేనన్నా ఎన్నాళ్ళకైనా
చావులేని వారు ఎవరన్నా
దేవుడెక్కడున్నడనుచు దేవులాటలెందుకన్నా
దేవుడే జీవుడు వినరా జీవుడే దేవుడు కదరా
కరుణాభి సుందరూడన్నా సువిశాలమైన
కానుకుంట్ల మందిరూడన్నా
వరములిచ్చే భక్తకోటికి వాంఛలు కడతేర్చడంలో
వీరదాసుకు సిరులనిచ్చే విశ్వమంత కూడదగను