#drkhadervali #healthylifestyle #millets #Dr Khadervali interview,
సిరిధాన్యాలు... ! ఆరోగ్యంపై అవగాహనతో ఉన్నవారిలో ఎక్కువ మంది ఈ ధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ ధాన్యాల్లో ఉన్న అద్భుత గుణాలతో చాలా మంది తమ అనారోగ్య సమస్యలను నియంత్రించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మిల్లెట్స్ వినియోగం గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ మార్పునకు బీజం వేసింది.... రైతునేస్తం ఫౌండేషన్ మరియు డాక్టర్ ఖాదర్ వలీ గారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. డాక్టర్ ఖాదర్ వలీ గారి సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సందేశాన్ని రైతునేస్తం ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలకు చేర్చింది. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో వందకుపైగా ఆరోగ్య సదస్సులు నిర్వహించి... ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోంది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం డాక్టర్ ఖాదర్ వలీ గారు చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం … ప్రభుత్వాలు మిల్లెట్స్ ఆహారానికి ఇస్తున్న ప్రాధాన్యాతను నిదర్శనం. సిరిధాన్యాలు మరియు ప్రకృతి జీవన విధానాలపై అనేక సదస్సుల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా... ఇంకా అనేక మందిలో కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేస్తూనే సిరిధాన్యాలు మరియు ఇతర మిల్లెట్స్ పై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ రోజు డాక్టర్ ఖాదర్ వలీ గారితో ముఖాముఖి కార్యక్రమం......
---------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/CLvetQ7edCk
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham
☛ Follow us on - https://twitter.com/rythunestham