"భారతీయ ఇతిహాస యాత్ర"
ఎన్నో కథలు, ఉపకథలతో సాగిపోయే మహాభారతంలో 18 పర్వాలు, లక్ష శ్లోకాలు ఉన్నాయి. ఈ మహాభారతం అసలు పేరు జయం. కురుక్షేత్ర యుద్ధం జరిగి ధర్మరాజు చక్రవర్తి అయిన తరువాత కాలంలో వ్యాసమహర్షి ఈ మహాభారతాన్ని రచించారు. వ్యాసులవారు చెబుతుండగా సాక్షాత్తూ వినాయకుడే వ్రాసుకుంటూ వెళ్లాడు. మహాభారతాన్ని రచించడానికి వ్యాసులవారికి పట్టిన సమయం మూడు సంవత్సరాలు. అంతటి మహాభారతకథను ఇలా సుమారు రెండు గంటల సమయంలో చెప్పడం చాలా క్లిష్టమైన పనే. కానీ ఎన్నో రోజుల పాటు పరిశ్రమ చేసి మూలకథకు ఒక సంక్షిప్త రూపం ఇవ్వగలిగాను. నేను తయారు చేసిన ఈ కథలో ఎటువంటి ప్రక్షిప్తాలుగానీ, ఊహలు గానీ లేవు. మన అజగవలో చెబుతున్న ఈ మహాభారతానికి వ్యాసభారతమే ప్రామాణికం. ఈ రెండు గంటల కథ వింటే మహాభారతంలో ఏ పర్వంలో ఏం జరిగిందన్న విషయంపై కూడా మీకు కనీస అగాహన వస్తుంది.
ఇక మహాభారతంలోకి ప్రవేశించేముందు ఎప్పటిలానే నాదొక విన్నపం.
భాషా సాహిత్యాలకు సేవచేయడం ఆదాయాన్ని తెచ్చిపెట్టే విషయం మాత్రం కాదు. ప్రత్యేకించి కేవలం సాహితీసేవకు మాత్రమే కట్టుబడిపోయినవారికి వారివారి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది. కనుక అజగవకు మీవంతు సాహితీ పోషణ చేయాలి అనుకునేవారు 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. అలానే సాహితీ సంబంధమైన విషయాలగురించి మీకేమైనా సందేహాలుంటే rajanptsk@gmail.com కు email చేయండి. నాకు తెలిసినవాటికి తప్పకుండా సమాధానాలిస్తాను. ఇక మహాభారతాన్ని ప్రారంభిద్దాం.
00:00 మహాభారత పరిచయం
03:45 ఆదిపర్వం
31:30 సభాపర్వం
41:37 అరణ్యపర్వం
55:08 విరాటపర్వం
01:00:47 ఉద్యోగపర్వం
01:08:34 భీష్మపర్వం
01:14:58 ద్రోణపర్వం
01:26:10 కర్ణపర్వం
01:31:31 శల్యపర్వం
01:36:35 సౌప్తికపర్వం
01:39:44 స్త్రీపర్వం
01:41:59 శాంతిపర్వం
1:43:42 అనుశాసనపర్వం
1:45:24 అశ్వమేధికపర్వం
1:48:00 ఆశ్రమవాసిక పర్వం
1:50:26 మౌసలపర్వం
1:51:33 మహాప్రస్థానికపర్వం
1:57:50 స్వర్గారోహణపర్వం
#mahabharatam #AjagavaBharatam #indianepics